Sarkar Live

Districts

Weather News | నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Districts, State

Weather News | నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Weather News | రాష్ట్రంలో కుండ‌పోత‌ వర్షాలు బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వ‌ర్షాల‌తో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాల‌నీలు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. అయితే మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరించ‌డంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ‌లోని మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో గురువారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ...
Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
State, Districts

Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచ‌రిచ‌డం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోంద‌ని తెలియ‌డంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వ‌ణికిపోతు న్నారు. తాజాగా బోథ్ ‌మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్ద‌పులి ద‌ర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంద‌రు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతున‌నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని ...
IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం
Districts

IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం

IMD Report | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. ఈసారి కాస్త ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అండ‌మాన్‌లోకి ప్రవేశించినట్లు మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ ‌దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుప‌వ‌నాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ (IMD ) వెల్లడించింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవ‌కాశం ఉం‌దని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. IMD Report : జూన్ 12 నాటికి తెలంగాణకు రుతుపవనాలు కాగా, సాధారణంగా జూన్‌ 1‌వ తేదీ నాటికి ...
Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..
Districts, State

Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..

Hyderabad Temperatures : హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరాయి. ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 మధ్య ఉరుములతో కూడిన తుఫానుల రూపంలో కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. "రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత వచ్చే 3 రోజుల్లో క్రమంగా 2 - 3 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉంటుంది" అని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ ఆదివారం సాయంత్రం తన అంచనాలో తెలిపింది. Hyderabad Temperatures : హైదరాబాద్ లో వర్షాలు! ఏప్రిల్ 3, గురువారం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోని ప్రజలు తీవ్రమైన వేడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు,.ఎందుకంటే IMD కొన్ని జిల్లా...
Hyderabad Metro | మెట్రో చార్జీలు మళ్లీ పెరగనున్నాయా ?
State, Districts

Hyderabad Metro | మెట్రో చార్జీలు మళ్లీ పెరగనున్నాయా ?

Hyderabad Metro | హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరోసారి మెట్రో రైలు టికెట్‌ రేట్లు పెంచాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంటున్నది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని సమాచారం. ఎల్‌అండ్‌టీ సంస్థ నగరంలో మెట్రో రైలు మొదటిదశ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ)లో 2012లో రూ.14,132 కోట్లతో పనులు ప్రారంభించి 2017 నవంబర్ లో పూర్తి అయ్యాయి. మూడు కారిడార్ల పర...
error: Content is protected !!