Sarkar Live

Hyderabad

Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌
State, Hyderabad

Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై వెంట‌నే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామ‌ని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ రమేష్‌ బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేద‌ని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించింద‌ని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామ‌ని కానీ, ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.కాగా నవంబర్‌ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్‌ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా...
IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ
State, Hyderabad

IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ

Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ (IAS transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల‌కు స్థాన‌చ‌న‌లం క‌ల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్ర‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ ‌నియమితులయ్యారు. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు కేటాయించింది. మెట్రోపాలిటన్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్యదర్శి బాధ్యతలు సీఎస్‌ ‌వద్దే ఉంచింది.ఇక జీఏడ...
Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
Hyderabad

Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలకు పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ మేర‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధుల‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఉప‌ముఖ్య‌మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెల‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది. మ‌రోవైపు రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం ని...
Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు
State, Hyderabad

Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు

Hyderabad | మొంథా తూపాన్‌ (Cyclone Montha) తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ భారతదేశంలో కుంభ‌వృష్టి కురిపిస్తోంది. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటిన మొంథా తుఫాన్‌ భద్రాద్రి కొత్తగూడం మార్గంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం ఉద‌యం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ (Warangal) , నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి కలెక్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయంతో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్ఆప‌రు.సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, వర్షాల ప్రభావం, నష్టాలపై అత్య‌వ‌సరంగా చేప‌ట్టాల్సిన ప‌నుల‌పైసమీ...
Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..
State, Hyderabad

Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..

హైద‌రాబాద్‌, స‌ర్కార్‌లైవ్ : మొంథా తుపాను (Montha Cyclone) ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, పాల‌మూరు జిల్లా వ్యాప్తంగా వాన‌లు విజృంభిస్తున్నాయి. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి మండ‌లం ర‌ఘుప‌తిపేట వ‌ద్ద దుందుభి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. దీంతో క‌ల్వ‌కుర్తి – నాగ‌ర్‌క‌ర్నూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈరోజు జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌ను వాయిదా వేశారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన‌లు ప‌డుతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్ర...
error: Content is protected !!