Hydra : హైడ్రాకు కొత్తగా ప్రత్యేక పోలీస్ స్టేషన్.. మరిన్ని అధికారాలు
Hydra Police Station : హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తూ.. నీటి వనరులను పరిరక్షిస్తూ హైస్పీడ్ తో దూసుకుపోతున్న హైడ్రా ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా (Hydra) ప్రత్యేక విభాగానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోహైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 8వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇకపై చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరిగే అక్రమ ఆక్రమణలపై స్థానికులు లేదా అధికారులు ఫిర్యాదు చేస్తే, హైడ్రా పోలీస్ స్టేషన్లలోనే కేసులు నమోదవుతాయి. ఇప్పటివరకు సాధారణ పోలీస్ ...