Peace Talks | నక్సల్ సమస్యపై చర్చ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Peace Talks on Naxals issues : తెలంగాణ మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి (former Minister K Jana Reddy)తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy ) భేటీ అయ్యారు. జానారెడ్డిని ఆయన నివాసంలో సీఎం సోమవారం కలిశారు. రాష్ట్రంలోని నక్సలైట్ల సమస్య (naxals issues) పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆదివారం జరిగిన పీస్ టాక్స్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డితో రేవంత్ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
శాంతి చర్చలపై సమాలోచన
కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పీస్ టాక్స్ (Peace Talks Committee) కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌ను కోరారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) నేపథ్యంలో తక్షణ సీజ్‌ఫైర్ ప్రకటించాలని కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్...