KCR | కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్
'నిజం బయటపడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి
Kaleshwaram Commission | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రికగా, కిరీట రత్నంగా పరిగణించబడే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలపై వచ్చిన ఆరోపణలపై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది.
బీఆర్‌కే భవన్ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈసందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 100 భాగాలు ఉన్నాయి. ప్రాజెక్టులోని రెండు బ్యారేజీల వద్ద ప్రమాదం జరిగింది. త్వరలో నిజం బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో ఈ వేధింపులకు తగిన గుణపాఠం చెబతారు. ఇది కా...




