Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
Heatwave in Telangana : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం (Heatwave) చూపించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు (Heatwave ) వీస్తాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలక...

