తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం – Anganwadi Egg Biryani
Anganwadi Egg Biryani | వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers ) తిరిగి తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ అనే థీమ్‌తో నిర్వహించిన ర్యాలీల్లో చిన్నారులకు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు మొదటిరోజు చిన్నారులకు ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ (Egg Biryani in Anganwadi centers)’ ని మధ్యాహ్న భోజనంలో వడ్డించారు. పిల్లలు ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం.
Egg Biryani : అంగన్ వాడీల్లో వెరైటీ ఫుడ్
ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు తగినట్లుగా ఆహారంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.. చిన్నారులకు వెరైటీ ఫుడ్ అం...