Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
Peddaplli News : సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) రైలు మరోసారి మార్గమధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది.
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. అయితే ఎంతసేపటికీ రైలు కదలలేదు. మరోవైపు అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం కాలినడకన రాజీవ్ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రతీరోజు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలురి ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఉదయాన్నే వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు...