Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
                    అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీకి ఆదేశాలు
Urea Distribution in Telangana : తెలంగాణలో కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా బస్తాల కోసం పీఏసీఎస్ ల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెడుతున్న దృశ్యాలు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోపులాటలు, ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసింది.
యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)  ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ...                
                
             
								


