Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్
Medak News : మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో వీధికుక్కలు చేసిన దాడి (Stray Dog Attack) లో బాలుడు నితిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TG Human Rights Commission) శనివారం సీరియస్ గా తీసుకుంది.
నాలుగేళ్ల బాలుడు బిస్కెట్లు కొనడానికి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ, బాలుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. వీధి కుక్కల బెడద పెరుగుతున్నట్లు స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు, కానీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా, వీధికుక్కల ప్రాణాంతక దాడులు (Stray Dog Attack) అమాయకుల ప్రాణాలను, ముఖ్యంగా పిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ సంఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ, ఈ ముప్పును పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతుండడం తీవ్ర ఆందోళన...