Harish Rao | “రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్ను విధించుడు తప్ప కొత్తదేమీ లేదు”
                    Nizamabad | రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పన్నులు విధించుడు తప్పన ఇంకేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు.ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ భూముల ధరలు పడిపోయాయని తెలిపారు. బీర్ల ధరలు, విస్కీ ధరలు పెంచించారని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు డబల్ టికెట్ కొడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశాడు.నూట్రిషన్ కిట్టు బందు.. కేసీఆర్ కిట్టు బందు.. బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ ఉండంగా ఎట్ల ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేసిండు అని ప్రశ్నించారు. రేవంత...                
                
             
								



