తొలి విడత పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామస్థులు – Gram panchayat elections
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్తయ్యింది. తీవ్ర చలి (Cold)ని కూడా లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు (Senior citizens) ఉదయం నుంచే క్యూకట్టారు.
56,19,430 మంది ఓటర్లు.. 37,562 పోలింగ్ కేంద్రాలు
మొదటి విడత పంచాయతీ (Gram panchayat elections) ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు అభ్యర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు ఉండగా 37,562 పోలింగ్ కేంద్రాలు (Polling stations) ఏర్పాటు అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒ...




