Sarkar Live

State

రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం
warangal

రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రోషిని ఆదేశాలతో  ​వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దిలీప్ రాజ్ నేతృత్వంలో వరంగల్ పోచంమైదాన్ సెంటర్ లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.దేశవ్యాప్తంగా రైతులను నష్టపరిచే విధంగా మోడీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. ​రైతులకు న్యాయం జరిగే వరకు, వారి హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా రైతుల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తామని...
అక్రమ మట్టి రవాణాపై పోలీసుల మెరుపు దాడి: జేసీబీ, 6 ట్రాక్టర్లు సీజ్
warangal

అక్రమ మట్టి రవాణాపై పోలీసుల మెరుపు దాడి: జేసీబీ, 6 ట్రాక్టర్లు సీజ్

గీసుగొండ మండల పరిధిలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై గీసుగొండ పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఒక జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గీసుగొండ సి ఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ..​చంద్రయ్యపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి నుండి కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసులు నమోదు చేశారు. ​నిందితుల వివరాలు: ​ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి: ​గండికోట సతీష్ (మనుగొండ) ​గాడు...
హన్మకొండ అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?
Special Stories, State

హన్మకొండ అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?

హన్మకొండ జిల్లాలోని దామెర మండలం ల్యాదల్లలో గల లక్ష్మీగణపతి రైస్ మిల్లులో ధాన్యం నిల్వలపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. పౌరసరఫరాల శాఖ రికార్డులకు, మిల్లులో క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు పొంతన లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సుమారు 20 ఏసీకేల (ACKs) బియ్యం బాకీ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ​అసలేం జరిగింది? ​పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం.. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఈ మిల్లుకు ప్రభుత్వం 1823.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఈ ధాన్యాన్ని మరాడించి మొత్తం 43 ఏసీకేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 23 ఏసీకేలు మాత్రమే సివిల్ సప్లై రికార్డుల్లో నమోదయ్యాయి. అంటే, ఇంకా సగానికి పైగా (20 ఏసీకేలు) బియ్యం  పెండింగ్‌లో ఉన్నాయి. ​గోల్‌మాల్ జరిగిందా? ​మిల్లులో ఉం...
గీసుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: టాటా ఏసీ ఢీకొని బైకర్ మృతి
warangal, State

గీసుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: టాటా ఏసీ ఢీకొని బైకర్ మృతి

అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గీసుగొండ మండల పరిధిలోని హర్జా తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...​హైదరాబాద్‌లోని పురాణాపూల్‌కు చెందిన భూక్య రవి (36) వృత్తిరీత్యా డ్రైవర్. శనివారం (ఏప్రిల్ 04) తన పల్సర్ బైక్ (TS12 E 8265) పై సొంతూరు కొల్లాపురం (గూడూరు మండలం) కు వచ్చాడు. తిరిగి ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరాడు. ​మార్గమధ్యలో గీసుగొండ మండలం హర్జా తండా గ్రామ శివారులోని ఓంకార్ స్తూపం మలుపు వద్దకు రాగానే, వరంగల్ వైపు నుండి నర్సంపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ (AP20 TB 4305) వాహనం రవి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ​అక్కడికక్కడే మృతి.. ​టాటా ఏసీ డ్రైవర్ పొన్నం వంశీ వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రవి బైక్ పైను...
ఆదిలాబాద్‌ ‘ఎయిర్‌పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు  ‌‌Adilabad
State

ఆదిలాబాద్‌ ‘ఎయిర్‌పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు ‌‌Adilabad

Revanth Reddy Adilabad Visit | రాజకీయాల్లో విశ్వాసం, విలువలే పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉద్ఘాటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తూనే, గత ప్రభుత్వానికి భిన్నంగా తాము అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలను వివరించారు. పీపుల్స్ మార్చ్ స్ఫూర్తితోనే అధికారం నాడు పిప్రి గడ్డ నుంచే భట్టి విక్రమార్క 1400 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అందుకే ఆదిలాబాద్ జిల్లాపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలు కేవలం అమాయకులు మాత్రమే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులని ...
error: Content is protected !!