Pod taxi : హైదరాబాద్ కు అత్యాధునిక పాడ్ టాక్సీలు?
Pod taxi in Hyderabad : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికేందుకు కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుసాగుతోంది. నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) లేదా పాడ్ ట్యాక్సీ వ్యవస్థను (Pod taxi System) ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
పీఆర్‌టీ వ్యవస్థ మొదట్లో రెండు కారిడార్‌లలో రానుంది. మెట్రో స్టేషన్‌లను కీలక కార్యాలయ కేంద్రాలు, బహుళజాతి కంపెనీలు, రాయదుర్గ్, మాదాపూర్, కొండాపూర్ సమీప ప్రాంతాల్లోని భారీ భవనాలతో కలుపుతుంది. 28 స్టాప్‌లతో 8.8 కి.మీ పొడవైన కారిడార్-I రాయదుర్గ్- ఐటీసీ కోహెనూర్-నాలెడ్జ్ సిటీని కవర్ చేస్తుంది దీనికి రూ. 880 కోట్ల వ్యయం అవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. మరోవైపు కారిడార్-IIలో 6 కి.మీ మేర 27...




