Sarkar Live

State

Kites | ప‌తంగుల‌పై ఆంక్ష‌లు.. అతిక్ర‌మిస్తే జ‌రిమానా
State

Kites | ప‌తంగుల‌పై ఆంక్ష‌లు.. అతిక్ర‌మిస్తే జ‌రిమానా

Sankranti festival Kites : సంక్రాంతి సంద‌ర్భంగా ఎగుర‌వేసే గాలిప‌టాల‌ (Kites )పై హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) ఆంక్ష‌లు విధించారు. పంతగులు ఎగుర‌వేసే సమ‌యంలో డీజే వినియోగంపై దృష్టి పెట్టారు. ఈ మేర‌కు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి.ఆనంద్ (CV Amand) ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 14న జరిగే సంక్రాంతి వేడుకల సందర్భంగా నగరంలోని రహదారులపై పతంగులు ఎగరవేయ‌డం, డీజేలు పెట్ట‌డం పూర్తిగా నిషేధించారు. ఇత‌ర ప్రాంతాల్లో కొన్ని ప‌రిమితులు విధించారు. కఠిన చర్యలు త‌ప్ప‌వు.. పరిశ్రమల ప్రాంతాల్లో సాధార‌ణంగా ప‌గ‌లు 75 డెసిబెల్స్, రాత్రుళ్లు 70 డెసిబెల్స్ వరకు మాత్రమే శబ్ద స్థాయి అనుమతి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో ప‌గ‌లు 65 డెసిబెల్స్, రాత్రి 55 డెసిబెల్స్ వరకు మాత్రమే ప‌రిమితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు (Kites) ఎగరేసే సమయంలో టెర్రస్‌లపై DJల వినియోగం విపరీతంగా ఉం...
Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?
State

Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?

Pushpa 2 Reloaded : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లుఅర్జున్ (Allu Arjun). ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప-2తో నటుడిగా మరొక మెట్టు ఎక్కారు. పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయిన పుష్ప-2 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇంతకుముందు వచ్చిన పుష్ప-1 మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టారు. ఈ మూవీ అంతకంటే రెట్టింపు హిట్ అయింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ఓ లెవల్లో ఉండడంతో ఈసారి కూడా అవార్డు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొదట డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీని ఒకటే పార్ట్ గా తీయాలనుకున్నారు. కానీ ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో స్టోరీ డిమాండ్ మేరకు రెండు పార్ట్ లుగా మారింది. దీంతో అల్లు అర్జున్ దాదాపు ఐదు సంవత్సరాలు తన సమయాన్ని ఈ మూవీకే కేటాయించాల్సి వచ్చింది. కాగా ఈ మూవీ బ...
ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు
State

ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు

భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అవినీతి నిరోధక సంస్థ‌ (ACB) ఎదుట హాజ‌ర‌య్యారు. ఫార్ములా -ఈ అక్రమాల కేసులో ఆయ‌న్ను ఏసీబీ ప్ర‌శ్నించ‌నుంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ మిసాప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్‌కండక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ కన్‌స్పిరసీకి సంబంధించిన IPC సెక్షన్ల కింద కేసుల‌ను కేటీఆర్ (KT Rama Rao) ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹55 కోట్ల నష్టం కలిగించాయని ప్ర‌ధాన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఈ కేసులు న‌మోద‌య్యాయి. న్యాయవాది తోడుగా రాగా.. విచార‌ణ స‌మ‌యంలో కేటీఆర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు అనుమతించింది. అయితే.. ఏసీబీ ప్ర‌శ్నించే స‌మ‌యంలో న్యాయవాది జోక్యం అవ‌స‌రం లేద‌ని కోర్టు స్పష్టం చేసింది. దూరం నుంచి చూసేందుకు మాత్ర‌మే అనుమతి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌ర‌ఫున ఏసీబీ కార్యాల‌యానికి ప్ర‌...
Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి
State

Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి

Tirumala Stampede : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు రద్దీగా మార‌డంతో పద్మావతిపురం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో మల్లిక అనే మహిళా భక్తురాలితో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన భక్తురాలు సేలంకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. Tirumala Stampede : దర్శనం కోసం వచ్చి.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ల కేంద్రాల వద్ద పెద్ద‌ సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తున్నారు. అయితే బైరాగి పట్టిడ పార్కు వద్ద క్యూలోకి భక్తులను అనుమతించిన వెంటనే భక్తుల మధ్య‌ తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో కొంద‌రు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగగా అక్క‌డ‌ మల్లిక అనే మహిళతో పాటు మరో ముగ్గురు...
Sankranti Festival : సంక్రాంతికి హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులు
State

Sankranti Festival : సంక్రాంతికి హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులు

Hanamkonda : సంక్రాంతి సెల‌వులను (Sankranti Festival ) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్ర‌త్యేక‌ చ‌ర్య‌లు చేపట్టింది. పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులను నడపనుంది. అందుబాటులోకి ఎల‌క్ట్రిక్ బ‌స్సులు వరంగల్ రీజినల్ మేనేజర్ (Warangal RTC RM) డి.విజయభాను తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్-హన్మకొండ మార్గంలో కూడా నడుపుతామని వెల్ల‌డించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు దిశానిర్దేశం చేసేందుకు సూపర్ వైజర్లను నియమించారు. Sankranti Festival : బస్ స్టాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి పర్వదినం (Sankranti Festival) సందర్భంగ...
error: Content is protected !!