Sarkar Live

State

KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..! కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!
State

KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..! కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త‌న‌దైన శైలిలో సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. ‘నేను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నా అలవాటు లేదు కదా.. అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో ఆయన ప్ర‌త్యేకంగా సమావేశమ‌య్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజలు ఏమంత్రం సంతోషంగా లేద‌ని అన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లు కనబడితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. నిన్న కాంగ్రెస్‌ వాళ్లు పోలింగ్‌ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్‌ వచ్చిందడంతో కార్య‌కర్త‌లు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తులం బంగారం కోసం ఆశ‌ప‌డి ఓటేశారు : KCR ...
Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో  ఉస్మానియా హాస్పిటల్..
State

Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో ఉస్మానియా హాస్పిటల్..

New Osmania Hospital : కార్పొరేట్ హాస్పిట‌ల్ ను త‌ల‌ద‌న్నేలా అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఉస్మానియా హాస్పిట‌ల్ నిర్మాణానికి అడుగుప‌డింది. హైద‌రాబాద్ గోషామహల్‌ (Goshamahal) ‌పోలీస్‌ ‌గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో సుమారు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. మొత్తం 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్‌, ‌కాలేజ్‌లు, హాస్టల్‌ ‌వసతుల‌తో అత్యాధునిక‌ ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిట‌ల్‌ (Osmania General Hospital )లో అనుగుణంగా హెలిప్యాడ్‌ ‌వసతి, హాస్పిటల్‌ ‌మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్ర‌త్యేక‌ ప్లాంట్‌, ‌విశాలమైన పార్కింగ్‌ ‌ఫెసిలిటీల‌ను క‌ల్పించ‌నున్నారు. ఈ ఆస్ప‌త్రిన నిర్మాణానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్కు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ ...
Vehicle Kills Leopard | పాపం చిరుత‌.. నీళ్ల కోసం వెళ్తూ..
State

Vehicle Kills Leopard | పాపం చిరుత‌.. నీళ్ల కోసం వెళ్తూ..

Vehicle Kills Leopard : నీళ్ల కోసం రోడ్డుపై వ‌చ్చిన ఓ చిరుత ప్రాణాలు కోల్పోయింది. వేగంగా దూసుకొచ్చిన వాహ‌నం ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లా (Medak district) రామాయంపేటలో నిన్న రాత్రి (గురువారం) చోటుచేసుకుంది. నేష‌న‌ల్ హైవే- 44 (National Highway 44) దాటుతున్న ఆడ‌ చిరుత రోడ్డు ప్ర‌మాదానికి బ‌లైంది. చెక్ డ్యామ్ వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరి.. రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన చిరుత (Leopard) వ‌య‌సు 6-7 సంవ‌త్సాలు ఉంటుంద‌ని మెద‌క్ జిల్లా అట‌వీ శాఖ అధికారి ఎం.జోజి తెలిపారు. ఇది మృతి చెందే స‌మ‌యంలో ఆరోగ్యంగానే ఉంద‌ని పేర్కొన్నారు. గతంలోనూ ఈ చిరుతను సమీపంలోని అటవీ ప్రాంతం, చెక్ డ్యామ్ వద్ద కనుగొన్న‌ట్టు చెప్పారు. వ‌న్య‌ప్రాణులకు తాగునీటి కోసం ఈ చెక్ డ్యామ్‌ను ఏర్పాటు చేయ‌గా అక్క‌డికి అవి వ‌స్తూ పోతాయ‌ని తెలిపారు. ఈ చిరుత కూడా నీళ్లు తాగేందుకు వ‌చ్చే క్ర...
Guillain Barre Syndrome | హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసు
State

Guillain Barre Syndrome | హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసు

Guillain Barre Syndrome case in Hyderabad | భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌రం పెడుతున్న గులియన్-బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. కొత్త‌గా తెలంగాణ‌లోనూ దాపురించింది. తాజాగా హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు ఈ అరుదైన‌ వ్యాధి (Guillain Barre Syndrome) నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తున్నారు. భారతదేశంలో GBS కేసులు భార‌త‌దేశంలో గులియ‌న్‌-బారే సిండ్రోమ్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్రగా ఇవి అత్య‌ధికంగా న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ 130 కేసులు న‌మోద‌య్యాయి. పూణె, సోలాపూర్ త‌దిత‌ర‌ జిల్లాల్లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించారు. బాధితుల్లో ఇద్దరు ఇప్ప‌టికే మృతి చెందారు. దీంతో మహారా...
Warangal Jakaria : ఉగ్రవాదులతో సంబంధం లేదు : జకారియా
State

Warangal Jakaria : ఉగ్రవాదులతో సంబంధం లేదు : జకారియా

Warangal Jakaria : వరంగల్ శివనగర్ కు చెందిన జమాత్‌–ఉల్‌–ముస్లిమీన్‌ ఆల్‌ ఇండియా ప్రెసిడెంట్ జకారియాను చైన్నె ఇమ్మిగ్రేషన్‌ అధికారులు (Immigration officers) అదుపులోకి తీసుకొని విచారించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా దీనిపై జకారియా ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. త‌న బాధ‌ను వెల్ల‌బోసుకున్నారు. వరంగల్‌లో ఉగ్ర మూలాలు ఉన్నాయంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన ప్రచారం అంతా వట్టిదేనన‌ని తెలిపారు. తనకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు లేవని వరంగల్ కు చెందిన జకారియా కొట్టిపారేశారు. మూడు రోజులపాటు విచారణ అనంతరం తనకు నిషేధిత సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఎన్ఐఏ అధికారులు గుర్తించార‌ని తెలిపారు. శ్రీలంకకు వెళ్తుండ‌గా అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, పూర్తిస్థాయి విచారణ జరిపి వదిలివేసినట్లు జకారియా వెల్ల‌డించారు. ఇదిలా ఉండగా 15 మంది సభ్యులతో కలిసి శ్రీలంకకు వెళ్లి వెళ్తుండగా అతడి...
error: Content is protected !!