Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..
Medak News | తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని మాజీ మంత్రి హరీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెదక్ పర్యటనలో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను పట్టించుకోలేదని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ లో శాంతియుంతంగా దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించడాన్ని,హరీష్ రావు ఖండించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు ప...




