Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబర్ మోసానికి బలి
Digital Arrest : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ ఆన్‌లైన్ అక్రమాలకు అడ్డుపడటం లేదు. నిరక్షరాస్యులే కుండా విద్యావంతులు ఈ క్రిమినల్స్ ట్రాప్‌లో పడుతూనే ఉన్నారు. అమాయకులేననికాకుండా ఈ తరహా అక్రమాలపై పూర్తి అవగాహన ఉన్నవారు సైతం అనివార్యంగా సైబర్‌నేరగాళ్లకు చిక్కుతున్నారు. హైదరాబాద్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘటనే దీనికి నిదర్శనం.
యువతిని నిర్బంధించి…
హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో పనిచేసే ఉత్తర భారతానికి చెందిన ఓ యువతి డిజిటల్ అరెస్టు బారిన పడింది. సైబర్ నేరగాళ్లు ఆ యువతిని ఆన్‌లైన్‌లో నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేశారు. తనను మోసం చేయడానికే ఈ తతంగం నడుస్తోందని ఆమె గుర్తించినా ఏమీ చేయలేకపోయింది. అనివార్యంగా ఈ ఉచ్చుకు చిక్కింది. ఐటీ సెక్టార్‌లో పని చేస్తున్న ఆమె ఈ తరహా మోసంపై అవగాహన ఉన్నప్పటికీ నిస్సహాయ స్థిత...




