Sarkar Live

State

Metro Rail | బెంగళూరు మెట్రో ధరలు పెరిగాయి..  హైదరాబాద్ లోనూ పెంచుతారా?
State

Metro Rail | బెంగళూరు మెట్రో ధరలు పెరిగాయి.. హైదరాబాద్ లోనూ పెంచుతారా?

Hyderabad Metro Rail : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవ‌లే ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం పెంచింది. మ‌రోవైపు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మెట్రో ఛార్జీలను కూడా దాదాపు 43 శాతం పెంచాలని క‌ర్ణాట‌క స‌ర్కారు యోచిస్తోంది. మెట్రో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ఛార్జీలను సవరించలేదని BMRCL అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్టేషన్లలో మౌలిక వ‌సతులు, రైళ్ల నిర్వహణ, మహిళల కోసం ప్రత్యేక కోచ్‌లను అందించడం, సీనియర్ సిటిజన్లు, ఇతరులకు ప్రత్యేక సేవలను అందించడం వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మెట్రో ఛార్జీలను పెంచాల్సి వ‌స్తున్న‌ద‌ని BMRCL పేర్కొంది. ధ‌ర‌ల స‌వ‌ర‌ణ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఛార్జీల పెంపుదలని బీఎంఆర్‌సీఎల్ ప్రతిపాదించింది. అయితే బీఎంఆర్‌సీఎల్ నిర్ణయం ప్రయాణికులకు ఏమాత్రం మింగుడు పడడం ...
Pod taxi : హైద‌రాబాద్ కు అత్యాధునిక పాడ్ టాక్సీలు?
State

Pod taxi : హైద‌రాబాద్ కు అత్యాధునిక పాడ్ టాక్సీలు?

Pod taxi in Hyderabad : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్‌ ఐటీ కారిడార్‌లో తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికేందుకు కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌తో ప్ర‌భుత్వం ముందుసాగుతోంది. నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) లేదా పాడ్ ట్యాక్సీ వ్యవస్థను (Pod taxi System) ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పీఆర్‌టీ వ్యవస్థ మొదట్లో రెండు కారిడార్‌లలో రానుంది. మెట్రో స్టేషన్‌లను కీలక కార్యాలయ కేంద్రాలు, బహుళజాతి కంపెనీలు, రాయదుర్గ్, మాదాపూర్, కొండాపూర్ సమీప ప్రాంతాల్లోని భారీ భవనాలతో కలుపుతుంది. 28 స్టాప్‌లతో 8.8 కి.మీ పొడవైన కారిడార్-I రాయదుర్గ్- ఐటీసీ కోహెనూర్-నాలెడ్జ్ సిటీని కవర్ చేస్తుంది దీనికి రూ. 880 కోట్ల వ్యయం అవుతుందని స‌ర్కారు అంచనా వేస్తోంది. మరోవైపు కారిడార్-IIలో 6 కి.మీ మేర 27...
Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి
State, Business

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థా...
BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి
State

BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్‌రెడ్డి

Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ పదవిలో కొన‌సాగుతుండ‌గా ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ (Bharatiya Janata Party) అధ్య‌క్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అర‌వింద్‌, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి ప్రముఖ నేత‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. BJP : ఇత‌ర పార్టీల్లా కాదు.. బీజేపీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే విధానం ఇత‌ర పార్టీల‌కంటే భిన్నంగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రి (Union Minister of Coal and Mines) కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లాల అధ్యక్షుల ఎంపిక జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా పూర్తవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ తరహాలో ముందే నిర్ణయాలు తీ...
TG Ration Cards : పాత రేష‌న్‌కార్డుల‌పై నో టెన్ష‌న్‌.. స్ప‌ష్ట‌త ఇచ్చిన స‌ర్కారు..
State

TG Ration Cards : పాత రేష‌న్‌కార్డుల‌పై నో టెన్ష‌న్‌.. స్ప‌ష్ట‌త ఇచ్చిన స‌ర్కారు..

Telangana Ration Cards : పాత రేషన్‌కార్డులు తీసివేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ స‌ర్కారు స్ప‌ష్ట‌త ఇచ్చింది. రేష‌న్ కార్డు తొల‌గిస్తామ‌నే అపొహలు ఏమంత్రం నమ్మొద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. .ఏ ఒక్కరి రేషన్‌కార్డు తొలగించ‌బోమ‌ని ఆయ‌న‌ హామీ ఇచ్చారు పాత రేషన్‌కార్డులు తొలగించేది లేదు.. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి కొత్త‌ రేషన్‌కార్డులు (Ration Cards) జారీ చేస్తామ‌ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) భ‌రోసా ఇచ్చారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ప‌ది సంవ‌త్స‌రాలుగా పేదలు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి కోరిక నెరవేరబోతోందని తెలిపారు. కులగణనలో నమోదు చేసుకున్న సమగ్ర వివరాల ఆధారంగానే రేషన్‌కార్డులను జారీ చేస్తామ‌ని పేర్కొన్నారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా ఎలాంటి అనుమానాలు, ఆందోళనలు పెట్టుక...
error: Content is protected !!