Foxconn | హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
Hyderabad : తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ (Foxconn) తన పరిశ్రమను హైదరాబాద్‌కు బదులుగా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ త్వరలో రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మంగళవారం ప్రకటించారు.
మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. ఫాక్స్‌కాన్ సంస్థ హైదరాబాద్‌లో తన ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు కంపెనీ మారనున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. “ఫాక్స్‌కాన్‌కు బెంగళూరు, చెన్నై, గుజరాత్‌లలో బేస్ ఉంది. ఇది వివిధ ప్రదేశాలలో తన కార్యకలాపాలను విస్తరించుకోవాలని భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
త్వరలో Foxconn ప్రకటన
దీనికి సంబంధి...




