Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు…
Ponguleti Srinivas Reddy : సంక్రాంతి పండుగ పూట తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద జరిగింది. అయితే కారు డ్రైవర్ ఆ క్షణంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
కాగా టైర్లు పేలిపోవడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. అయితే డ్రైవర్ పరస్థితిని అదుపులోకి తేవడంతో మంత్రితో పాటుగా కారులో ఉన్న ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాద సమయంలో కారులో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజ...




