Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోమారు వర్షం
Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి పలుచోట్ల వరుసగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరంగల్ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంటపాటు పడిన వర్షానికి రహదారులపై వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో అమ్మకానికి తెచ్చిన పత్తి, మొక్కజొన్న తడిసిపోవంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల ‘మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు మరోసారి వర్షాల ముంపు భయంతో వణికిపోతున్నాయి.
రేపు వర్షం కురిసే అవకాశం
తెలంగాణ వెదర్ మాన్ అంచనా ప్రకారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్...




