Sarkar Live

State

రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి
Hyderabad

రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi )కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా వీరిద్దరినీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆయన చేసిన సేవలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident
Mahaboobnagar, Crime

జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident

Jadcherla Government Hospital Incident | మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. Jadcherla Hospital : అసలేం జరిగింది? జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్‌ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లగా, లోపల కుక్కల శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఒక కుక్క భీమేశ్ మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని బంధ...
తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!
State, Hyderabad

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. “రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు...
ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు
State, warangal

ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (Greater Warangal Municipal Corporation) పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంటలో జిల్లా ఉపాధ్యక్షులు Kondeti Komura Reddy జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 15వ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండేటి కొముర రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు....
Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి
Crime, warangal

Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి

వరంగల్ పోలీస్ కమిషనరేట్  (Warangal Police Commissionerate) పరిధిలో నేరాల నియంత్రణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువత గంజాయి మత్తుకు బానిసలవకుండా, గంజాయి సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించి నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో( Kakatiya Medical College)లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కమిషనర్ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, పెండింగ్ వారెంట్ల అమలు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రతి కేసులో వేగం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి గంజాయి వినియోగదారులను పట్టుకోవడం మాత్రమే కాకుండా, సరఫరా చేస్తున్న ప్రధాన నెట్వర్క్‌ను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పా...
error: Content is protected !!