Sarkar Live

State

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్‌పాయిజ‌న్‌.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు ‌‌ – Food Poisoning
State

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్‌పాయిజ‌న్‌.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు ‌‌ – Food Poisoning

Jogulamba Gadwal : ఐజా మండలం షేక్‌పల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠ‌శాల‌-క‌ళాశాల‌లో శనివారం ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాస్ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం), అఖిలేష్‌ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) భరత్ (ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం) ముగ్గురు విద్యార్థులను చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారికి ఉద‌యం అల్పాహారంగా జీరా రైస్ వడ్డించినట్లు సమాచారం. పాఠశాల సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. యాదృచ్ఛికంగా, ఈ పాఠశాల ధర్మవరంలోని బీసీ హాస్టల్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 50 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలా...
IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ
State, Hyderabad

IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ

Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ (IAS transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల‌కు స్థాన‌చ‌న‌లం క‌ల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్ర‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ ‌నియమితులయ్యారు. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు కేటాయించింది. మెట్రోపాలిటన్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్యదర్శి బాధ్యతలు సీఎస్‌ ‌వద్దే ఉంచింది.ఇక జీఏడ...
Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
Hyderabad

Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలకు పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.1,031 కోట్లు విడుదల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఈ మేర‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధుల‌ను విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఉప‌ముఖ్య‌మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెల‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది. మ‌రోవైపు రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం ని...
Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌
Crime, Khammmam

Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌

Khammam news : ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నేత (CPM leader) సామినేని రామారావు (Samineni Ramarao ) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొంద‌రు సామినేని రామారావుని గొంతు కోసి హత్య చేశారు. మ‌రో మూడు రోజుల్లో ఖ‌మ్మంలో రామారావు త‌న‌ మనవరాలి పెళ్లికి ఉండ‌గా ఇంత‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేక‌రించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రామారావు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా కొన‌సాగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి కాగా, సామినేని రామారావు హత్య విష‌యం తెలుసుకుని డిప్యూటీ సీఎం...
Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..
State, warangal

Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..

వరంగల్‌ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Warangal : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది.. భారీ వరదల కార‌ణంగా అనేక కాల‌నీలు పూర్తిగా మునిగిపోయి ప్ర‌జ‌లకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు వ‌ర‌ద బాధితుల‌ను హుటాహుటిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇండ్ల‌లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకె...
error: Content is protected !!