Sarkar Live

State

Bhupalpally |  విద్యార్థులకు క‌రెంట్ షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌
warangal

Bhupalpally | విద్యార్థులకు క‌రెంట్ షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Jayashankar Bhupalpally News : స్వాతంత్య్ర వేడుక‌ల (Independence Day celebrations) ఏర్ప‌ట్ల‌లో ఉన్న విద్యార్థులు విద్యాదాఘాతానికి (Electric Shock) గుర‌య్యారు. జాతీయ జెండాను సిద్ధం చేస్తున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ముగ్గురు విద్యార్థుల‌తోపాటు ఒక స్కావెంజ‌ర్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ‌గా వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally district) మ‌హ‌దేవ‌పూర్ (Mahadevpur mandal) మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఈ సంఘ‌ట‌న ఇవాళ చోటుచేసుకుంది. జాతీయ జెండాను క‌ట్టే ఇనుప పోల్‌(iron pole)ను పాఠ‌శాల భ‌వ‌నం పైనుంచి దింపుతున్న క్ర‌మంలో విద్యుత్ తీగ‌లు తాకి ముగ్గురు విద్యార్థులతోపాటు స్కావెంజ‌ర్ షాక్‌ (Electric Shock) కు గుర‌య్యారు. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన (minor injuries) వీరిని మ‌హాదేవ‌పూర్ సామాజిక ఆస్ప‌త్రి (Hospital)కి త‌ర‌లించారు. విద్యుదా...
BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం  స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌
State, Hyderabad

BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌

BRS vs Congress : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ‌కుంట్ల‌ రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt)పై ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమ‌ర్శించారు. ముఖ్యంగా జూరాల, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్ర‌మాద‌ హెచ్చరికలు (danger warnings) వెలువడినా వాటిని పట్టించుకోవడంలేదని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాత్రమే రాజకీయం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్ల‌ర్లు దెబ్బతిన్నాయనే కారణంగా కాంగ్రెస్, బీజేపీలు నిరంతరం విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులలో కూడా మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితి ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కూ కాలానుగుణంగా మరమ్మతులు అవసరం అవు...
Heavy Rains | ఆగ‌ని వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ
State

Heavy Rains | ఆగ‌ని వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ

Heavy Rains in Telangana : తెలంగాణలో ఎడ‌తెర‌పిలేకుండా భారీ వ‌ర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ (southern Telangana)లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇంకా ఇవి కొన‌సాగొచ్చ‌ని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట త‌దిత‌ర‌ జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. Heavy Rains : ఎక్క‌డెక్క‌డ అంటే.. ప్రస్తుతం ఉన్న తక్కువ వాయు పీడన (low-pressure) పరిస్థితులు సముద్ర మట్టం నుంచి పైపొరల వరకు చురుగ్గా ఉన్నాయి. దీని కారణంగా వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జన‌గాం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దప...
Earthquake | వికారాబాద్‌లో  భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు
Hyderabad, State

Earthquake | వికారాబాద్‌లో భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు

ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు Earthquake : వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున భూమి కంపించింది. భారీ వ‌ర్షం న‌డుమ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత న‌మోదైంద‌ని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు మాత్రమే ఈ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఈ సంఘటన భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో చోటుచేసుకోవడంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప్రకంపనలు ఎక్కడెక్క‌డ అంటే.. తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్, ప‌రిగి పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ప్రత్యేకంగా జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉన్న మండలాల్లో ఇవి ఎక్కువగా క‌నిపించాయ‌ని స్థానికులు చెబుతున్నారు. దీని ప‌రిస్థితిపై సహజ విపత్తుల విభాగం అధికారులు సమీక్షిస్తున్నారు. Earthquake : రెండు విపత్తుల కలయిక సాధారణంగా ఒక ప్రాంతంలో ఒ...
ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
Crime, Karimnagar

ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ACB Arrest | పెద్దపల్లి జిల్లా(Peddapalli)లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు నుంచి భూమి సర్వే చేసిన రిపోర్టు ఇవ్వడానికి సర్వేయర్ భారీగా లంచం డిమాండ్‌ చేశాడు. అందుకు ఆ రైతు కొంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.10,000 ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ద్వారా మండల సర్వేయర్ పైండ్ల సునీల్ అకౌంట్ కు బదిలీ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పైండ్ల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10,000 లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఓ రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి రూ.10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వ...
error: Content is protected !!