Sarkar Live

State

Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్
Medak

Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్

Medak News : మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో వీధికుక్కలు చేసిన దాడి (Stray Dog Attack) లో బాలుడు నితిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TG Human Rights Commission) శనివారం సీరియ‌స్ గా తీసుకుంది. నాలుగేళ్ల బాలుడు బిస్కెట్లు కొనడానికి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ, బాలుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. వీధి కుక్కల బెడద పెరుగుతున్నట్లు స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు, కానీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా, వీధికుక్కల ప్రాణాంతక దాడులు (Stray Dog Attack) అమాయకుల ప్రాణాలను, ముఖ్యంగా పిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ సంఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ, ఈ ముప్పును పరిష్కరించడంలో అధికారులు విఫ‌ల‌మ‌వుతుండ‌డం తీవ్ర ఆందోళన...
Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం
warangal, State

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం

Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్​ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్...
Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు
Hyderabad, State

Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు

Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో ప‌దేళ్ల‌పాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా అల‌జ‌డి వ్య‌క్త‌మవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Congress : సీఎం రేవంత్ ఏమన్నారు? శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడ‌ని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువ...
Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..
AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..

Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియ‌ట్‌ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్య‌మైన‌ ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గ‌త‌ సోమవారం క‌ళాశాల‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేప‌ట్ట‌గా గండికోటలో విద్యార్థిని మృతదేహం ల‌భ్య‌మైంది.. వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...
TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?
State

TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్‌..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?

TGBKS | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) నుంచి MLC కవితకు ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై TGBKS.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించారు. కవిత, KTRల మధ్య విభేదాలు పెరుగుతున్న తరుణంలో KTR కొప్పుల ఈశ్వర్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం బుధ‌వారం సాయంత్రం జ‌రిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించార...
error: Content is protected !!