Sarkar Live

State

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada
State, AndhraPradesh

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు. విజయవాడ అభివృద్ధికి "మంచినీటి ప్రవాహంలా" నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు. అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ₹150 కోట్లు ప్రకటించినప్పటికీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని పౌర సమస్యలను పరిష్కరి...
Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం
Hyderabad, State

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం

Metro Phase 2 : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మియాపూర్-ఎల్బీనగర్ (29 కి.మీ.), నాగోల్-రాయదుర్గం (29 కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్-ఎంజీ బస్టాండ్ (11.2 కి.మీ.) రూట్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 69.2 కి.మీ మేర మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం 86.1 కి.మీ మేర మూడుసూత్రాల మెట్రో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 19,579 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2 ప్రధాన కారిడార్ల వివరాలు: Metro Phase 2 కారిడార్-1: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ (మణికొండ / ORR సమీపం) వరకు 39.6 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ రూట్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి...
Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!
State, warangal

Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!

Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ‌ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.వెనకబడిన జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు క్యాబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్‌ మంత్రులకు మంత్రి సీతక్క జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చెప్పిన విధంగా, ఈ నిర్ణయం ములుగు జిల్లాకు అభివృద్ధి దిశగా పెద్ద బలాన్నిస్తుంది. ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ (Oil Palm) పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాకు కొత్త ఊపు రానుంది. జిల్లాలో ...
Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన
Hyderabad, State

Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన

వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ దివ్యాంగుల ఉపకరణాల కోసం ఏటా రూ.50 కోట్లు మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సీత‌క్క‌ Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధో మథ‌న సదస్సు 2025 జ‌రిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించి అభినందించారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఆదివాసీల ఆహార...
CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
Hyderabad

CM Revanth Reddy | భారీ వర్షాల వేళ.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Hyderabad : ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస...
error: Content is protected !!