farmer’s protest | యూరియా కొరతపై నిరసన… గజ్వేల్‌లో రైతుల రాస్తారోకో
farmer's protest in Gajwel : రైతులు మళ్లీ రోడ్డెక్కారు. యూరియా కొరత (urea shortage) వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) సమీపంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారోకో (rasta roko) చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
రోడ్డు పైకి వందలాది మంది రైతులు
ఈ రాస్తారోకో బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో జరిగింది. వందలాది మంది రైతులు భారీ సంఖ్యలో ఉదయం నుంచే గజ్వేల్ (Gajwel) వద్దకు చేరారు. రోడ్డు మధ్యలో కూర్చుని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించ...