BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో సమరోత్సాహం..
BRS Silver Jubilee బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi-BRS) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుక (Silver Jubilee Celebrations) జరగనుంది. రేపు (ఏప్రిల్ 27న ) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి (Elkathurthi)లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. దీని కోసం ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి.
BRS Silver Jubilee : జోరుగా ప్రచారం
ఈ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ జెండాలు, తోరణాలు కడుతున్నారు. గోడల మీద రాతలు రాస్తున్నారు. పోస్టర్లు అంటిస్తున్నారు. ఇది కేవలం ఒక సభ కాదని, ఒక ఉద్యమంలా మారుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభ (the largest public meeting in India)ను పెట్టలేదని అంటున్నారు. ఎల్కతుర్తిలో దాదాపు 1300 ఎకరాల్లో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందులో 200 ఎకరాలను సభా వేదిక కోసం ప్రత్...
