Sarkar Live

warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
State, warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha

Dasara Ravanavadha 2025 | వ‌రంగ‌ల్ : విజయదశమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న‌ గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ‌ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...
Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం
State, warangal

Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం

Medaram Temple | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం (Medaram Temple) అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించింది. మేడారం ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శంకుస్థచేస్తారని మంత్రులు ప్రకటించారు. ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్య...
Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
Crime, warangal

Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అత‌డు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మ‌ద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను త‌ర‌చూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పడంతో వీరి మ‌ధ్య గొడవలు పెరిగాయి. ఈ క్ర‌మంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్క‌సారిగా దాడి చేయడంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...
ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli
Crime, warangal

ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli

Mother kills husband and daughter : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లా చిట్యాల మండలం వొడితల గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పక్షవాతంతో మంచాన పడిపోవడంతో సపర్యలు చేయాల్సిన భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడిపోతుందనే భయంతో, ఆమె ప్రియుడి సాయంతో భర్తతో పాటు తన 22 ఏళ్ల కూతురును కూడా కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే, జూన్ 25న కవిత తన భర్తను హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే, తమ సంబంధం విషయం కుమార్తెకు కూడా తెలిసిపోతుందనే భయంతో 22 ఏళ్ల కూతురినీ పక్కా ప్లాన్​ వేసి హత్య చేసింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి, క్షుద్రపూజల వల్లే చనిపోయిందనే ఊరి జ...
Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక
warangal, State

Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక

Warangal News | విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ (Ragging) వంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చ‌ట్ట ప్ర‌కారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ (Warangal CP) స‌న్‌ప్రీత్ సింగ్‌ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న నేప‌థ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడ‌మ‌నేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంటుంద‌ని అన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుంచి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ర్యాగింగ్‌ పా...
error: Content is protected !!