ULLU, ALTT వంటి 25 OTT యాప్స్‌పై నిషేధం – జాబితా ఇదీ.
దేశంలోని ప్రసిద్ధ OTT యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీల కంటెంట్ అందిస్తున్నాయన్న ఆరోపణలతో ALTT, ULLU, Desiflix, BigShots సహా 25 యాప్‌లను నిషేధిస్తూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ యాప్‌లు ఐటీ చట్టం 2000 (సెక్షన్ 67, 67A), ఇండియన్ జస్టిస్ కోడ్ 2023 (సెక్షన్ 294), మహిళల అసభ్య ప్రాతినిధ్యం నిషేధ చట్టం 1986 (సెక్షన్ 4) తదితర చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలున్నాయి. స్టోరీబోర్డ్ 18 నివేదిక ప్రకారం, ఈ యాప్‌లు అశ్లీల వీడియోలు, బోల్డ్ ప్రకటనలు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను బహిరంగంగా చాలా కాలంగా ప్రసారం చేస్తున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వీటికి యాక్సెస్‌ను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ముఖ్యంగా పిల్లలు ఈ కంటెంట్‌కి ఆకర్షితులవుతున్నారని, దీనివల్ల సమాజంపై ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని తెలిపింది. స...