Chandrayaan 5 mission | చంద్రయాన్-5 మిషన్‌కు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన సర్కార్
Chandrayaan 5 mission : చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 250 కిలోల బరువున్న రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Indian Space Research Organization (ISRO) ఇక ప్రయోగించనుంది. భారత ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ (Chandrayaan programme) భారత చంద్ర అన్వేషణ కార్యక్రమంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నాలుగు ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇటీవల చంద్రయాన్-3 ద్వారా భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై సులువుగా దిగిన ప్రపంచంలోని తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా భారత్...