Semiconductor | భారత్‌లో తొలి సెమీ కండక్టర్ చిప్ తయారీ.. త్వరలోనే విడుదల
india's first Semiconductor Chip : ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారతదేశం అద్భుత వృద్ధిని సాధిస్తోంది. ప్రస్తుతం రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ను దాటింది. రూ. 5 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తోంది. ఇప్పటికే అనేక కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్న భారతదేశం మరో అడుగు ముందుకేసింది. స్వదేశి సెమీ కండక్టర్ చిప్ (india's first Semiconductor Chip) తయారీకి సిద్ధమైంది. ఇది ఈ ఏడాది (2025)లోనే అందుబాటులోకి రానుంది. భోపాల్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ మేరకు ప్రకటించారు.
Semiconductor Chip : ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు
భారతదేశ తొలి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ 2025లో పూర్తిగా సిద్ధంగా ఉండబోతోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు HLBS టెక్నాలజీ కంపెనీ ...