Prayagraj | మహా కుంభ మేళాలో ఆల్‌టైం రికార్డ్..
అమెరికా, రష్యా జనాభాను దాటిన భక్తుల సంఖ్య
Maha kumbh 2025 : ప్రయాగ్‌రాజ్( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళా ఆల్‌లైం రికార్డు నమోదు చేసుకుంది. 12ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేలాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు నిత్యం యాత్రికులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు సందర్శించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది ఏ మతానికి సంబంధించి అయినా ఈ సంఖ్య ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సామూహిక మానవ సమ్మేళనంగా నిలుస్తుందని తెలిపింది. భారత్, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల జనాభా సంఖ్యను కుంభమేళాను దర్శించిన హిందూ భక్తుల సంఖ్య దాటేసిందని పేర్కొంది.
యూఎస్ జనాభా బ్యూరో ప్రకారం చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా (34.20 కోట్లు) గల మూడో దేశం అమెరికా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గణంకాల ప్రకారం ఈ శుక్ర...