Google to enhance traffic | హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ.. గూగుల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్..
                    Google to enhance traffic | హైదరాబాద్ నగరం ట్రాఫిక్‌ను అత్యుధునిక టెక్నాలజీతో నియంత్రించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ సమయంలో కంట్రోల్ అయ్యేలా సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టనుంది. గూగుల్ ఇండియాతో కలిసి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించనుంది. ఇందుకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ cutting-edge టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
ఓ విప్లవాత్మక మార్పు
తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణకు ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. Google Maps, AI, Drone సర్వైలెన్స్, Cloud Storage లాంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ను సందర్శించింది. గూగుల్ ప్రస్తుత ప్రాజెక్టులను పర్యవేక్షిస్త...                
                
             
								



