ISRO | ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. ప్రయోజనాలు ఏమిటంటే..
                    ISRO New Mission 2025 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బుధవారం తన 100వ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV-F15) రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను ఈ మిషన్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూభాగం, వాయు, సముద్ర నావిగేషన్, ఖచ్చితమైన వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఉపయోగకరంగా ఈ శాటిలైట్ ఉంటుంది. ఇస్రో కొత్త చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) నేతృత్వంలో జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఆయన జనవరి 16న బాధ్యతలు స్వీకరించారు. 2025లో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం కూడా ఇదే.
GSLV-F15 రాకెట్ దూసుకెళ్లింది ఇలా..
GSLV రాకెట్ బుధవారం ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ISRO విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. 19 నిమిషాల ప్రయాణం తర్వాత, రాకెట్ తన పేలోడ్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో విజయవంతంగా విడదీసింది...                
                
             
								



