Viral Video | సెల్ఫీ తీస్తానని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి
                    Mahaboob Nagar Viral Video |  : సెల్ఫీ తీసుకునే నెపంతో ఓ భార్య తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన ఘటన శనివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని కడ్లూర్ గ్రామంలోని కృష్ణా నదిపై ఉన్న వంతెన దగ్గరకు తాతప్ప, అతడి భార్య వచ్చారు. ఈ వంతెన తెలంగాణలోని నారాయణపేట జిల్లాతో సరిహద్దులో ఉంటుంది. వంతెన వద్దకు చేరుకున్న తర్వాత, తాతప్ప, అతని భార్య మొబైల్‌లో కొన్ని ఫోటోలు తీశారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు, భర్త ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు .
తాతప్ప ఈదుకుంటూ నదిలో ఉన్న ఒక బండరాయిని పట్టుకోగలిగాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తాడుతో అతన్ని రక్షించారు. ఊపిరి పీల్చుకున్న తర్వాత, తాతప్ప తన భార్య తనను ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసిందని ఆరోపించాడు. ఆ జంట అక్కడికక్కడే గొడవ పడుతుండగా, స్థానికులు వారిని శాంతింపజేసి వారి తల్లిదండ్రులకు ఫోన్ చే...                
                
             
								



