Viral News | ఉదయాన్నే కోడి కూస్తోందని కేసు పెట్టాడు..
                    Rooster Viral News | సమాజంలో ఒక్కోసారి చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చాలా తేలికైన విషయంగా భావించేవి కొన్ని పోలీసు కేసుల వరకు వెళ్తాయి. తరచుగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలపై ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇలాంటివేవీ కాకుండా  ఓ వ్యక్తి  ప్రతిరోజు ఉదయాన్నే కోడి కూస్తూ తనకు నిద్ర పట్టకుండా చేస్తోందని కోడి యజమానిపై  అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ ఆసక్తికరమైన ఘటన కేరళ (Kerala Viral News )లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు పక్కింటి కోడి కూస్తోందని (Rooster crowing) అధికారులకు ఫిర్యాదు చేశాడు. 'తన ప్రశాంతమైన జీవితాన్ని భంగపరుస్తోందని ' అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళలోని పతనంతిట్ట (Pathanamthitta) ప్రాంతంలోని పల్లికల్ (Palli...                
                
             
								



