Donald Trump | ట్రంప్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పీఠం ఎక్కేందుకు అవరోధాలు
New York : డోలాల్డ్ ట్రంప్ (Donald Trump) ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆ పీఠం ఎక్కడానికి అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. హాష్ మనీ కేసులో ఆయనకు మరోసారి చుక్కెదురైంది. శిక్ష విధింపును వాయిదా వేయాలనే అభ్యర్థనను అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దేశ అధ్యక్షుడిగా ఈ కేసులో మినహాయింపులు, వెసులుబాటు కల్పించాలని ట్రంప్ ఇప్పటికే పలుమార్లున్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కగా ఆయనకు మరోసారి షాక్ తగిలింది….