Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్.. పెరుగుతున్న మరణాల సంఖ్య
Myanmar Earthquake | మయన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం (7.7 magnitude earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కూలిపోగా (Building Collapse) వేలాది మంది గాయపడ్డారు. శనివారం వరకు మరణించిన వారి సంఖ్య 1002గా నమోదైంది. గాయపడినవారి సంఖ్య 2376కి చేరింది. ఇంకా 30 మంది (more bodies) ఆచూకీ గల్లంతైంది.
కూలిన భవనాలు.. నేలమట్టమైన వంతెనలు
భూకంప ప్రభావంతో మయన్మార్ (Myanmar )లోని ప్రధాన నగరాలు మాండలే, నేపీడా, బాగో, యాంగాన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, రహదారులు (Road Cracks) ధ్వంసమయ్యాయి. కొన్ని వంతెనలు నేలమట్టమయ్యాయి (Bridges Collapse). భూకంప దాటికి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీరు పైకి పొంగి వరదలా మారింది. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక (Rescue Efforts) బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి.
సహాయక చర్యలకు అడ్డంకిగా అత్యురుద్ధం
మయన్మార్ (Myanmar)లో...