Protests against Elon Musk | టెస్లా కార్యాలయాల వద్ద నిరసనలు.. ఎందుకంటే..
Protests against Elon Musk : టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk )కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. వివిధ నగరాల్లోని టెస్లా డీలర్‌షిప్ కార్యాలయాల (stores) ఎదుట ఈ రోజు పెద్ద ఎత్తున బహిరంగ ప్రదర్శనలు నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రాజకీయ రంగంలో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఎలాన్ మస్క్ రాజకీయ జోక్యం
ఎలాన్ మస్క్ ((Elon Musk) కొంతకాలంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీల (federal agencies)ను పునర్‌వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యతకను కూడా ప్రముఖంగా సూచిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలను అనుసరించేలా మస్క్ అభిప్రాయాలు ఉండటంతో రాజకీయంగా ఆయనపై వ్యతిరేకత పెరిగింది. ఇందులో భాగంగ...