UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు షురూ..
UK's crackdown : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. సైనిక విమానాల ద్వారా అక్రమ వలసదారుల (illegal migrants)ను తమ దేశం నుంచి తరలించడం మొదలెట్టింది. తాజాగా యూకే (United Kingdom) కూడా అదే బాటపట్టింది. అక్రమ వలసదారులను తమ దేశం నుంచి పంచేందుకు అమెరికా అవలంబించిన విధానాన్నే అనుసరిస్తోంది. అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి నిర్బంధంగా తిరిగి పంపేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్కడున్న రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో యూకే హోంశాఖ ముమ్మరంగా తనిఖీలు (raids) చేపడుతోంది. తద్వారా వలసదారులను గుర్తించి తిరిగి పంపే ప్రక్రియ మొదలెట్టింది.
ఎక్కువ మంది భారతీయులే..
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూకేకు వలస వెళ్లి అక్కడ...