Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారు.. విదేశాల్లో 2 ఘటనలు
ఉన్నత చదువులు, బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు యువకులు తరచూ అనేక దుర్ఘటన (Tragic incident)లకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుపడతామని దేశం కాని దేశానికి వెళ్తున్న తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు.
ఐర్లాండ్‌లో గుంటూరు యువకులు
ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందార...