Pre-term deliveries : అమెరికాలో భారతీయుల ముందస్తు కాన్పులు.. ఎందుకంటే..
                    US citizenship : అమెరికా (US)లో భారతీయ మహిళలు ముందస్తు ప్రసవాలు (Pre-term deliveries) చేయించుకుంటున్నారు. నెలలు పూర్తిగా నిండక ముందే ఆపరేషన్ల ద్వారా పిల్లలను కనేందుకు ఆస్పత్రుల్లో బారులు తీరుతున్నారు. తల్లీబిడ్డలకు ఇది ఎంత ప్రమాదకరమని తెలిసినా ఈ రిస్కు తీసుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
ముందస్తు ప్రసవాలు ఎందుకంటే..
అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజే డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థులు, టూరిస్టులు, తాత్కాలిక వర్క్ వీసాలు కలిగిన వారికి జన్మించే పిల్లలకు ఇక ఆ దేశ పౌరసత్వం (Birthright US citizenship) లభించదని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిబంధన 2025 ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
చాలా కాలంగా అమ...                
                
             
								



