White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష.. కేసు ఏమిటంటే..
అమెరికాలోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White House)పై దాడి యత్నం కేసులో తెలుగు సంతతికి చెందిన 20 ఏళ్ల యువకుడు సాయి వర్షిత్ కందుల (ai Varshith Kandula)కు అక్కడి ప్రభుత్వం ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధించింది. నాజీ సిద్ధాంతాలకు ప్రేరేపితుడైన అతడు అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యంగా ఈ దాడి చేశాడని నిర్ధారణ కావడంతో ఈ శిక్షణు విధిస్తున్నామని అక్కడి న్యాయస్థానం పేర్కొంది. సాయి వర్షిత్ కందుల హైదరాబాద్ (Hyderabad)లోని చంద్రానగర్ ప్రాంతానికి చెందినవాడు. అమెరికా ( America White House )లో అతడు గ్రీన్ కార్డ్ హోల్డర్.
కేసు పూర్వపరాలు
కోర్టులో సమర్పించిన పత్రాల వివరాల ప్రకారం… 2023 మే 22న సాయంత్రం సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డిసి (Washington DC) వెళ్లాడు. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో డల్లస్ అంతర...




