Grimes | భారత్‌పై దుష్ప్రచారం చేయొద్దు.. ఎలాన్ మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఫైర్
American social media | భారత్‌పై అమెరికన్ సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేక భావాలపై ఎలాన్ మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ గ్రైమ్స్ (Elon Musk's Ex Girlfriend Grimes) తీవ్రంగా స్పందించారు. భారత్‌పై ఎక్కడి నుంచో పుట్టిన వ్యతిరేకతను ఉద్దేశపూర్వకంగానే విస్తరింపజేయడం దారుణమని ఖండించారు. కనడియన్ సంగీతకారిణి అయిన గ్రైమ్స్ తన పోస్టులో ఈ మేరకు అభిప్రాయపడ్డారు. అమెరికా సోషల్ మీడియా (American social media)లో చర్చిస్తున్న పరిస్థితులు ఇండియా (India)లో లేవని ఆమె పేర్కొన్నారు. తాను భారత్‌లో పెరిగానని, తన బాల్యాన్ని తానక్కడ అద్భుతంగా గడిపానని తెలిపారు. భారత్‌పై దుష్ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చశారు.
ఇది ఉద్దేశపూర్వక చర్య అన్న Grimes
తన పోస్ట్‌లో గ్రైమ్స్ నిరాశ వ్యక్తం చేస్తూ భారత్‌పై వ్యతిరేక భావాలను ఎక్కడి నుంచో అకస్మాత్తుగా సృష్టించడం దారుణం. ఇది ఉ...


