Sarkar Live

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 21 మంది మృతి – Chevella Road Accident

Chevella Road Accident | హైద‌రాబాద్‌, బీజాపూర్ జాతీయ ర‌హ‌దారిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న

Chevella Road Accident

Chevella Road Accident | హైద‌రాబాద్‌, బీజాపూర్ జాతీయ ర‌హ‌దారిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలోఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాల‌య్యారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులోనే కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేప‌ట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని జాగ్ర‌త్త‌గా బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులో నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉండ‌గా అందులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు స‌మాచారం. హైదరాబాద్‌లోని పలు క‌ళాశాల‌ల‌కు వెళ్లేందుకు రోజువారీగా బ‌స్సులో ప్రయాణిస్తున్నారు. బస్సుపై టిప్పర్‌ పడిపోవడంతో డ్రైవర్‌ వైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రయాణికుల ఆర్తనాలతో ప్రమాద స్థలం స‌మీప ప్రాంతాల‌కు వినిపించ‌డం అంద‌రినీ క‌ల‌వ‌ర‌పాటుకు గురించేసింది. ఈ ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే (Hyderabad-Bijapur Highway)పై భారీగా ట్రాఫిక్‌జామ్ అయి వాహ‌నాలు కిలోమీట‌ర్ల మేర స్తంభించిపోయాయి. చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో ఘటనా స్థలానికి అంబులెన్స్‌కు కూడా చేరుకోలేని దుస్థితి ఏర్పడింది.

Chevella Road Accident : సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఘోర రోడ్డు ప్ర‌మాదం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. “రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదం యొక్క పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి, వారికి మెరుగైన వైద్య చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకోవాలని సీఎం కోరారు” అని తెలంగాణ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?