Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
‘పూనా మర్గం’కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న ‘పూనా మర్గం’ (Puna Narkom – నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముందని మావోయిస్టులు వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార్యాలయంలో పోలీసు అధికారులు తమ సమక్షంలోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
20 నెలల్లో 508 మంది సరెండర్
ఎస్పీ రాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024-25లో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లు, ఎదురుకాల్పులు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్రయోజనాలు మావోయిస్టులు హింసను విడిచిపెట్టడానికి కారణమవుతున్నాయని తెలిపారు. గత 20 నెలల్లో దంతేవాడ జిల్లాలోనే 508 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇది పోలీసుల సమష్టి కృషికి నిదర్శనమని ఆయన కొనియాడారు. దంతేవాడ పోలీసులు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మిగిలిన మావోయిస్టులకు ఎస్పీ రాయ్ పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి.







