Sarkar Live

రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply

మంజునాధ ఏంది నీ దందా .. Civil supply scam : ప్రభుత్వం నుండి ధాన్యం దింపుకోవడం ,అందులోనుండి సగానికి పైగా మాయం చేయడం కొంతమంది మిల్లర్ లకు అలవాటుగా మారినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్న రికార్డులకు,

మంజునాధ ఏంది నీ దందా ..

Civil supply scam : ప్రభుత్వం నుండి ధాన్యం దింపుకోవడం ,అందులోనుండి సగానికి పైగా మాయం చేయడం కొంతమంది మిల్లర్ లకు అలవాటుగా మారినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్న రికార్డులకు, క్షేత్రస్థాయిలో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ ఎత్తున వ్యత్యాసం ఉండటం పౌరసరఫరాల శాఖలో కలకలం రేపుతోంది. తాజాగా ఇప్పుడు మరో మిల్లర్ 2 కోట్లకు పైగా ధాన్యం మాయం చేయడం, ఆ విషయం ఇప్పటివరకు కూడా సివిల్ సప్లై అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

2 కోట్ల ధాన్యం ఎటుపోయింది ?

అక్షరాల రెండు కోట్లు విలువ చేసే ధాన్యం ఎక్కడ పోయినట్లు..?బహిరంగ మార్కెట్ కు తరలించారా ?కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగిందా?అనే విషయాలు పక్కన పెడితే అంత పెద్ద మొత్తంలో ఆ మిల్లులో ధాన్యం లేని విషయాన్ని సంబంధిత “డిటి” ఎందుకు గుర్తించలేదు? అనేది ప్రశ్న.వివరాల్లోకెళితే హన్మకొండ జిల్లా ఫున్నెలు పరిధిలోని “మంజునాధ” రైస్ మిల్లుకు పౌరసరఫరాల శాఖ 2024-25 రబీ సీజన్ లో 3357 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపించింది. సదరు మిల్లు యాజమాన్యం మరాడించి 2249 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి పంపించాలి.కానీ ఇప్పటివరకు 44 ఏసికెల బియ్యాన్ని మాత్రమే పంపించిన మిల్లర్ ఇంకా 34 ఏసికెల సీఎంఆర్(బియ్యం)ప్రభుత్వానికి పెట్టలేదు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే 34 ఏసికెల బియ్యానికి సరిపడా ధాన్యం ఆ మిల్లులో లేకపోవడం గమనార్హం.అసలు ఆ ధాన్యం ఎలా మాయమైనట్లు అనేది మిల్లర్ కే తెలియాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?