- ఒక్కో ప్లాటుకు ఒక్కో రేటు..
- నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేస్తున్న తహశీల్దార్
- రియల్టర్ లకు సహకారం… ప్రభుత్వ ఆదాయానికి గండి
Nala Conversion in Warangal | అవును ఇప్పుడు ఆ తహసీల్దార్ నాలా కన్వర్షన్ కిం(సిం)గ్ గా పేరు పొందినట్లు రెవెన్యూ శాఖ (Revenue Deportment)లో ప్రచారం జరుగుతోంది. అనుమతి లేని వెంచర్లు చేసే రియల్టర్లకు ఆ తహసీల్దార్ పెద్దదిక్కుగా మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఆ తహసీల్దార్ (Tahsildar) కు బాగానే కలిసొస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేయడం ద్వారా సదరు తహశీల్దార్ బాగానే వెనకేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేస్తూ రియల్టర్ లకు సహకరిస్తున్న ఆ అధికారి పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండికొడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Nala Conversion : ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..
హన్మకొండ జిల్లా(Hanmakonda District)లో విధులు నిర్వహిస్తున్న ఆ తహశీల్దార్ ఇటీవల కాలంలో నాలా కన్వర్షన్ పేరుతో లకారాలు కొల్లగొట్టినట్లు జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేసినందుకు గాను సదరు తహశీల్దార్ కు రియల్టర్ ల నుండి పెద్దమొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ అధికారి కి ఒక్కో ప్లాటుకు సుమారు రూ 30 వేలకు పైగానే వెంచర్ నిర్వాహకులు ముట్టజెప్పినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇలా ఈ మధ్య కాలంలో అనుమతి లేని వెంచర్ లలోని అనేక ప్లాట్లను నాలా కన్వర్షన్ చేసిన తహశీల్దార్ అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
గ్రేటర్ ఆదాయానికి గండి …?
అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ లు (Sub registrars) రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రియల్టర్ లు నయా ప్లాన్ కు తెరతీశారు. ఒక్కో ప్లాటుకు సపరేటు గా ప్లాట్ల వారిగా తహశీల్దార్ తో నాలా కన్వర్షన్ (Nala Conversion) చేపించి తద్వారా సబ్ రిజిస్ట్రార్ తో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నట్లు తెలుస్తోంది.అమ్యామ్యాలకు అలవాటు పడ్డ సదరు తహశీల్దార్ ఒక్కో ప్లాటుకు ఒక్కో రేటు తీసుకుని నాన్ లేఅవుట్ వెంచర్ (venchars)లోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఆదాయానికి పరోక్షంగా గండికొడుతూ అనుమతి లేకుండా వెంచర్ చేసే రియల్టర్ లకు బాగానే సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] వెంచర్లలోని వందలాది ప్లాట్లను సదరు తహసీల్దార్ (Tahasilar) నాలా కన్వర్షన్ (Nala Conversion) చేయడంతో […]